Virat Kohli: ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్.. మైదానంలో విరాట్ కోహ్లీ ‘నాటు నాటు’ స్టెప్స్!

Virat Kohli Does Naatu Naatu Dance Step In Slips in australia match
  • మైదానంలో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
  • నాటు నాటు పాటకు కాలు కదుపుతూ సందడి
  • టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఘటన
‘నాటు నాటు’ ఫీవర్ ఇంకా తగ్గలేదు. ఆస్కార్ వేదికతో మొదలు క్రికెట్ మైదానం దాకా ఎక్కడ చూసినా అదే ఆట.. పాట.. అందరూ కాళ్లు కదిపే వాళ్లే. తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరాడు. మైదానంలో ‘నాటు నాటు’ స్టెప్పులేస్తూ కనిపించాడు. ఇంకేముంది.. అందుకు సంబంధించిన వీడియో వైరలైంది.

ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ఈ రోజు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో స్లిప్స్ లో నిలబడిన కోహ్లీ.. నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఒకే సింక్ లో వేసిన స్టెప్స్ ను తానొక్కడే వేస్తూ కనిపించాడు. మరీ చరణ్, ఎన్టీఆర్ లా కాకున్నా బాగానే వేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసిన ఏకే అనే యూజర్.. ‘విరాట్ నాటు నాటు స్టెప్ వేస్తున్నాడుగా’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
Virat Kohli
Naatu Naatu
Virat Naatu Naatu Dance
Australia
Team India

More Telugu News