Kakinada: అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌పై నడివీధిలో హత్యాయత్నం

Man attacks mv inspector with knife in kakinada
షార్ట్స్‌లో చూడండి
కాకినాడలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌స్పెక్టర్‌పై కొబ్బరి బొండాల వ్యాపారి దుర్గాప్రసాద్ హత్యాయత్నం చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి తెగబడ్డాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌పైనా దాడికి యత్నించాడు. వాహనాల తనిఖీ సందర్భంగా ఇన్స్‌పెక్టర్ చిన్నారావుపై దుర్గాప్రసాద్ దాడికి తెగబడ్డాడు. దుర్గారావుకు చెందిన కొబ్బరి బొండాల వాహనం పేరున పలు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టు తొలుత ఇన్స్‌పెక్టర్ గుర్తించారు. డబ్బు కట్టాలని దుర్గారావును ఆదేశించారు. దీంతో..ఇద్దరి మధ్య వివాదం మొదలైందని పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనలో ఎంవీ ఇన్‌స్పెక్టర్ చిన్నారావు శరీరమంతా కత్తిగాయాలయ్యాయి. చేతి వేళ్లు తెగిపడ్డాయి. ఇక కొబ్బరి బొండాల కత్తితో ..చిన్నారావుపై నిందితుడు దుర్గాప్రసాద్ దాడి చేస్తున్న ఘటనకు సంబంధించి వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ చిన్నారావు ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Kakinada

More Telugu News