Changi Airport: ప్రపంచంలో నెంబర్ వన్ విమానాశ్రయం ఏదో తెలుసా...?

  • టాప్-20 జాబితా రూపొందించిన స్కై ట్రాక్స్ సంస్థ
  • అగ్రస్థానంలో సింగపూర్ ఛాంగీ ఎయిర్ పోర్టు
  • టాప్-20లో కనిపించని భారత విమానాశ్రయాలు
  • దక్షిణాసియాలో నెంబర్ వన్ గా ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు
This is number one airport in the world

విమానయాన సేవల కన్సల్టెన్సీ సంస్థ స్కై ట్రాక్స్ తాజాగా ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా విడుదల చేసింది. ఈ టాప్-20 ఎయిర్ పోర్టుల జాబితాలో సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయం నెంబర్ వన్ గా నిలిచింది. ఖతార్ ఎయిర్ పోర్టును వెనక్కి నెట్టి, రెండేళ్ల తర్వాత ఛాంగీ ఎయిర్ పోర్టు మళ్లీ అగ్రస్థానాన్ని అధిష్ఠించింది. 

విమాన ప్రయాణం అనంతరం ప్రయాణికుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను స్కై ట్రాక్స్ సంస్థ రూపొందించింది. ఈ టాప్-20 జాబితాలో భారత్ కు చెందిన ఒక్క విమానాశ్రయం కూడా లేదు. 

అగ్రస్థానంలో ఛాంగీ ఎయిర్ పోర్టు ఉండగా, రెండో స్థానంలో దోహా నగరంలోని హమద్ ఎయిర్ పోర్టు నిలిచింది. జపాన్ కు చెందిన నాలుగు విమానాశ్రయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 

కాగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దక్షిణాసియాలో నెంబర్ వన్ ఎయిర్ పోర్టుగా నిలిచింది.

స్కై ట్రాక్స్ టాప్-20 విమానాశ్రయాలు ఇవే...

1. చాంగీ ఎయిర్ పోర్టు- సింగపూర్
2. హమద్ ఎయిర్ పోర్టు- దోహా
3. హనీదా ఎయిర్ పోర్టు- టోక్యో
4. ఇన్చియాన్- సియోల్
5. చార్లెస్ డి గాలే- పారిస్
6. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు- టర్కీ
7. మ్యూనిచ్ ఎయిర్ పోర్టు- జర్మనీ
8. జ్యూరిచ్ ఎయిర్ పోర్టు- స్విట్జర్లాండ్
9. నరీటా- టోక్యో
10. బరాజస్- మాడ్రిడ్
11. వియన్నా ఎయిర్ పోర్టు- ఆస్ట్రియా
12. వాంటా ఎయిర్ పోర్టు- ఫిన్లాండ్
13. ఫ్యూమిసినో- రోమ్
14. కోపెన్ హేగెన్ ఎయిర్ పోర్టు- డెన్మార్క్
15. కాన్సాయ్ ఎయిర్ పోర్టు- జపాన్
16. సెంట్రైన్ నయోగా ఎయిర్ పోర్టు- జపాన్
17. దుబాయ్ ఎయిర్ పోర్టు- దుబాయ్
18. టకోమా- సియాటిల్
19. మెల్బోర్న్ ఎయిర్ పోర్టు- ఆస్ట్రేలియా
20. వాంకోవర్ ఎయిర్ పోర్టు- కెనడా

More Telugu News