Lottery: భార్య అలక తీర్చడం కోసం రెండు లాటరీ టికెట్లు కొన్నాడు... కోటీశ్వరుడయ్యాడు!

  • ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లో ఘటన
  • 30 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న దంపతులు
  • గతవారం భార్య పేరు మీద టికెట్ కొనడం మర్చిపోయిన భర్త
  • భర్తపై అలిగిన భార్య
Australian couple wins two lotteries at a time

అలిగిన భార్యను సంతృప్తి పరిచేందుకు ఓ వ్యక్తి రెండు లాటరీ టికెట్లు కొనగా, రెండింటికీ లాటరీ తగిలిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అక్కడి న్యూసౌత్ వేల్స్ కు చెందిన ఓ జంట గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్నారు. భర్త ఇటీవల తన భార్య పేరు మీద లాటరీ టికెట్ కొనుగోలు చేయడం మర్చిపోయాడు. దాంతో ఆమె ముఖం ముడుచుకుంది. భార్య అలకబూనిన విషయాన్ని గుర్తించిన ఆ వ్యక్తి... ఈసారి రెండు లాటరీ టికెట్లను భార్య పేరుమీదే కొనుగోలు చేశాడు. 

గత సోమవారం లాటరీ ఫలితాలు రాగా, ఆ రెండు టికెట్లకు లాటరీ తగిలింది. ఒకటి కాదు రెండు కాదు... ఒక్కో టికెట్ కు రూ.8 కోట్ల చొప్పున రెండింటికీ కలిపి మొత్తం రూ.16 కోట్లు వచ్చిపడ్డాయి. దాంతో ఆ భార్యాభర్తల ఆనందం అంతాఇంతా కాదు. 

తమ కుమార్తెకు కొత్త ఇల్లు కొనిస్తామని, తమ పిల్లల కోసమే కాకుండా, వారి పిల్లల కోసం కూడా లాటరీ సొమ్మును వినియోగిస్తామని ఆ దంపతులు వెల్లడించారు.

More Telugu News