Botsa Satyanarayana: ఉద్యోగులు మా కుటుంబ సభ్యులే.. పని చేయించుకున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందే: బొత్స సత్యనారాయణ

We have to pay salaries to Employees says Botsa Satyanarayana
  • టీడీపీ హయాంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు చూశామన్న బొత్స
  • విద్యాధికులు ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
  • తమది పేద ప్రజల సంక్షేమ బడ్జెట్ అన్న బొత్స
గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో ఆకలి చావులు, ఆత్మహత్యలు చూశామని... నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులేనని... ఉద్యోగులతో పని చేయించుకున్నప్పుడు జీతాలు ఇవ్వాల్సిందేనని అన్నారు. 

విద్యాధికులు ఎక్కువగా ఎక్కడ ఉంటారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అందుకే రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి రూ. 32 వేల కోట్లను కేటాయించామని తెలిపారు. సామాన్య ప్రజలకు మేలు కలిగేలా సంక్షేమానికి బడ్జెట్ లో పెద్ద పీట వేశామని చెప్పారు. వైద్య రంగానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించామని అన్నారు. పేదల కోసం ఆలోచించే ప్రభుత్వం తమదని, ఇది పేద ప్రజల సంక్షేమ బడ్జెట్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా బడ్జెట్ లో కలిపి చూపామని చెప్పడంలో నిజం లేదని అన్నారు.
Botsa Satyanarayana
YSRCP
Budget

More Telugu News