Indian Army: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చీతా

చీతా అనే భారత వైమానిక దళం హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయింది. ఈ హెలికాప్టర్ గురువారం బొమ్డిల పట్టణానికి పశ్చిమాన మండాల అనే ప్రాంతంలో కూలింది. ఈ ఉదయం 9.15 గంటలకు ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయినట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు గువాహటి రక్షణ రంగ ప్రజా సంబంధాల అధికారి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో భాగంగా ఈ హెలికాప్టర్ సెంగె నుంచి మిస్సమరి వెళ్తోందని పేర్కొన్నారు. 

దీనిలో పైలట్లుగా  ఓ లెఫ్టినెంట్ కల్నల్, ఓ మేజర్ ఉన్నట్లు సమాచారం. గాలింపు బృందాలను రంగంలోకి దించినట్లు ఈ ప్రకటన వెల్లడించింది. వైమానిక దళంలో చేతక్, చీత రకం హెలికాప్టర్లు 200 వరకు సేవలు అందిస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాలలో సాయుధ బలగాలకు ఇవి రక్షణగా ఉన్నాయి. కానీ, పాతబడుతున్న నేపథ్యంలో వీటి స్థానాల్లో కొత్త వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Indian Army
Cheetah
helicopter
crash
Arunachal Pradesh

More Telugu News