Anchor Lasya: నన్ను గట్టిగా హత్తుకున్న వ్యక్తివి నీవు: యాంకర్ లాస్య

Anchor Lasya lovely message to her husband
  • యాంకర్ లాస్య భర్త మంజునాథ్ పుట్టినరోజు నేడు
  • నన్ను నవ్వించిన వ్యక్తివి నీవు అన్న లాస్య
  • నన్ను బలంగా మార్చావని వ్యాఖ్య
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ లాస్యకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇటీవలే ఆమె రెండో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలను తెలియజేశారు. ఈరోజు లాస్య భర్త మంజునాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భర్త గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా తన ప్రేమాభిమానాలను వ్యక్తపరిచింది. భర్తపై ఆమె వెలిబుచ్చిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. 

'నా భర్త గురించి నేను ఎంతో గర్వపడుతున్నా. పర్ఫెక్ట్ హస్బెండ్. నా పిచ్చితనాన్ని క్షమించే ఏకైన వ్యక్తివి నీవు. మంజునాథ్ నీవు నన్ను నవ్వించావు. నా కన్నీళ్లు తుడిచావు. నన్ను గట్టిగా హత్తుకున్నావు. నా సక్సెస్ ను చూశావు. నా వైఫల్యాలను కూడా చూశావు. నన్ను ఎంతో బలంగా మార్చావు. లవ్ యూ' అంటూ లాస్య తన భర్తపై ఎంతో ప్రేమను కురిపించింది. భర్తపై లాస్య ప్రేమను చూసిన నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల అనుబంధానికి మీరు మారుపేరు అంటూ కొనియాడుతున్నారు.
Anchor Lasya
Husband
Birthday

More Telugu News