Jio Plus: కుటుంబం అంతటికీ కలిపి జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లు.. ఫ్రీ ట్రయల్

  • రూ.399, రూ.699 ప్లాన్లలో నలుగురికి చోటు
  • ముగ్గురు సభ్యులకు గాను నెలవారీగా చార్జీ రూ.99
  • రూ.599 ఇండివిడ్యువల్ ప్లాన్ లో పూర్తి డేటా ఫ్రీ
Jio Plus launched select plans come with free trial offer and Netflix subscription

కుటుంబం మొత్తం వినియోగించుకోవడానికి వీలుగా రిలయన్స్ జియో నూతన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. జియో ప్లస్ స్కీమ్ కింద వీటిని తీసుకొచ్చింది. 

రూ.399 నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో 75 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. కాల్స్, ఎస్ఎంఎస్ లు పూర్తిగా ఉచితం. రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రూ.699 పోస్ట్ పోయిడ్ ప్లాన్ లో 100 జీబీ డేటా లభిస్తుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. కాల్స్, ఎస్ఎంఎస్ లు ఉచితం. ఈ రెండు ప్లాన్లలోనూ ముగ్గురు సభ్యులను అదనంగా చేర్చుకోవచ్చు. అంటే మొత్తం నలుగురు సభ్యులు. కాకపోతే ప్రతి నంబర్ కు రూ.99 నెలవారీ చార్జ్ ఉంటుంది. ఈ ప్లాన్ సెక్యూరిటీ డిపాజిట్ రూ.875. నలుగురు సభ్యులు చేరినప్పటికీ ఉచిత బెనిఫిట్స్ ను అందరూ వినియోగించుకోవచ్చు.

ఇక రూ.299 ఇండివిడ్యువల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో కాల్స్ ఉచితం. 30జీబీ డేటా ఉచితం. ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే. రూ.375 సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలి. అలాగే, రూ.599 ప్లాన్ లో కాల్స్, ఎస్ఎంఎస్ లతోపాటు డేటా కూడా పూర్తిగా ఉచితం. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.750 కట్టాలి. ఈ ప్లాన్లలోనూ ఒక నెల ఉచిత ట్రయిల్ ఆఫర్ ఉంది. తీసుకుని, నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 

ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకోవాలని అనుకునే వారు 70000 70000 నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే వాట్సాప్ కు రిప్లయ్ వస్తుంది. ఇప్పటికే జియో ప్రీపెయిడ్ లో ఉన్నవారు సిమ్ మార్చాల్సిన పని లేకుండా ఫ్రీ ట్రయల్ సేవలు పొందొచ్చు.

More Telugu News