పోర్టుబ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా టీడీపీ అభ్యర్థి గెలవడం పట్ల చంద్రబాబు హర్షం
- పోర్టుబ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం
- చైర్ పర్సన్ గా టీడీపీ నేత సెల్వి
- అభినందనలు తెలిపిన చంద్రబాబు
బీజేపీ మద్దతుతో సెల్వి విజయం సాధించారని అన్నారు. సెల్వి నియామకం టీడీపీ-బీజేపీ కూటమిపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సేవలో ఆమె తన పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
