కిమ్ గురించి ఇంటర్నెట్లో వెదికాడు... మరణశిక్షకు గురయ్యాడు!
- ప్రజలపై నిఘా వేయాలని గూఢచారికి ఆదేశాలు
- ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు అనుమతి
- కానీ కిమ్ గురించి వెదికేందుకు ఇంటర్నెట్ వినియోగించిన వైనం
- ప్రాణాలు కోల్పోయిన గూఢచారి
ఈ బ్యూరో ఏజెన్సీలో పనిచేస్తున్న ఓ గూఢచారికి ప్రజలపై నిఘా వేసే విధులు అప్పగించారు. సాధారణంగా ఉత్తర కొరియాలో పౌరులకు ఇంటర్నెట్ సేవలు లభ్యం కావడం చాలా కష్టం. అయితే ఈ ఉద్యోగి గూఢచారి కావడంతో ఇంటర్నెట్ వినియోగానికి అనుమతి లభించింది. కానీ అతడు ప్రజలపై నిఘా వేసేందుకు కాకుండా, దేశాధినేత కిమ్ గురించి వెదికేందుకు ఇంటర్నెట్ ఉపయోగించాడు.
ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియడంతో, పాపం ఆ గూఢచారికి మరణశిక్ష విధించి అమలు చేశారు. మరికొందరు అధికారులు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినా, వారిని విధుల నుంచి తప్పించి అంతటితో సరిపెట్టారు. అంత విచిత్రంగానూ, భయానకంగానూ ఉంటుంది కిమ్ నియంతృత్వ పాలన.