Aryan Goura: 'ఓ సాథియా' నుంచి యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్!

  • ప్రేమకథా చిత్రంగా రూపొందిన ' ఓ సాథియా'
  • ఆర్యన్ గౌర జోడీగా నటించిన మిస్తీ చక్రవర్తి
  • దర్శకత్వం వహించిన దివ్యభావన 
  • త్వరలోనే రానున్న విడుదల తేదీ ప్రకటన  
O Sathiya lyrical song released

ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో 'ఓ సాథియా' అనే మూవీ రూపొందుతోంది. ప్రేమకథలో కూడా ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తన్విక - జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దివ్య భావన దర్శకత్వం వహించారు. ఆర్యన్ గౌర .. మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటించారు.   

హీరోగా ఆర్యన్ గౌర.. తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన సరసన మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసి, తాజాగా ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగును రిలీజ్ చేశారు. 

'నేల మీద లేనే ..  ఆ మాట నువ్వు చెప్పగానే..' అంటూ సాగిపోతున్న ఈ మెలోడియస్ సాంగ్ యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రేయసిని గాఢంగా ప్రేమిస్తున్న ప్రేమికుడి ఫీలింగ్స్ అన్నీ ఈ పాటలో కనిపిస్తున్నాయి. సాంగ్ టేకింగ్ .. అందుకు తగిన విజువల్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ ..  వినోద్ కుమార్ కట్టిన బాణీలు ఈ పాటకు మేజర్ అసెట్ అయ్యాయి. హీరోహీరోయిన్లపై ఎంతో నాచురల్‌గా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఈ సాంగ్ లెవెల్ పెంచేశాయని చెప్పుకోవచ్చు.

More Telugu News