ప్రశ్నాపత్రాల లీక్ నిందితుడు ప్రవీణ్ ఫోన్లో అన్నీ అలాంటి దృశ్యాలే!
- ప్రవీణ్ కు స్త్రీలంటే పిచ్చి అని గుర్తించిన పోలీసులు!
- అతడి ఫోన్ లో అశ్లీల దృశ్యాలు, నగ్న ఫొటోలు!
- టీఎస్ పీఎస్సీకి వచ్చే మహిళలతో పరిచయాలు
- వారిలో పలువురితో ప్రవీణ్ కు శారీరక సంబంధం
ప్రవీణ్ టీఎస్ పీఎస్సీ ఉద్యోగి. 2017లో జూనియర్ అసిస్టెంట్ గా చేరాడు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రవీణ్ టీఎస్ పీఎస్సీలో వెరిఫికేషన్ విభాగంలో పనిచేసినప్పుడు, అప్లికేషన్లలో పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చే మహిళలతో పరిచయం పెంచుకునేవాడు.
అప్లికేషన్లలోని సమస్యలను పరిష్కరించి, వారి ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. వారిలో కొందరితో ప్రవీణ్ శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నట్టు తెలిసింది. అతడి సెల్ ఫోన్ నిండా మహిళలతో కలిసి ఉన్న అశ్లీల దృశ్యాలు, మహిళల అసభ్య ఫొటోలు, మహిళల వాట్సాప్ నెంబర్లు గుర్తించారు. ప్రవీణ్ కు స్త్రీలంటే పిచ్చి అని అంచనాకు వచ్చారు.
ప్రవీణ్ కు ఏడాది కిందట టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పీఏగా ప్రమోషన్ లభించింది. ఉన్నతాధికారుల వద్ద అతడు ఎంతో విధేయుడిగా మెలుగుతూ, వారి నమ్మకాన్ని పొందాడు. అధికారుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని ప్రవీణ్ పేపర్ లీకేజికి తెరలేపినట్టు భావిస్తున్నారు.
కాగా, నిందితులు ప్రవీణ్, రేణుకల ఫోన్ లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇద్దరి మధ్య జరిగిన పూర్తి చాటింగ్ ను రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.