Revanth Reddy: ఎవరు అభ్యంతరపెట్టినా కాంగ్రెస్ లో చేరికలు ఆపొద్దని రాహుల్ చెప్పారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy opines on Congress party issues
  • కాంగ్రెస్ లో త్వరలో కొత్త చేరికలు ఉంటాయన్న రేవంత్
  • డీఎస్ చేరిక హైకమాండ్ పరిధిలోని అంశమని వెల్లడి
  • భట్టి పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానని వివరణ
  • బీఆర్ఎస్, బీజేపీ వీధి నాటకం ఆడుతున్నాయని విమర్శలు
కాంగ్రెస్ పార్టీలో కొత్త చేరికలు త్వరలోనే ఉంటాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరైనా నేతలు అభ్యంతరాలను వ్యక్తం చేసినా, చేరికలను మాత్రం ఆపొద్దని రాహుల్ గాంధీ చెప్పారని వెల్లడించారు. ఇక, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ పార్టీలో చేరే అంశం హైకమాండ్ పరిధిలో ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్ర ఏఐసీసీ కార్యక్రమం అని, తాను కూడా పాల్గొంటున్నానని తెలిపారు. 

ఈ సందర్భంగా... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపైనా రేవంత్ ధ్వజమెత్తారు. బీజేపీ-బీఆర్ఎస్ వీధి నాటకానికి తెరలేపాయని... ఓట్ల కోసం పాము- ముంగిస ఆట ఆడుతున్నాయని విమర్శించారు. 

కేసీఆర్ అవినీతిలో ఒక శాతంపైనే బీజేపీ ఆరోపణలు చేస్తోందని... బీఆర్ఎస్ పార్టీకి రూ.1000 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. బీజేపీ నేతలు ఈ రూ.1000 కోట్లను వదిలేసి రూ.100 కోట్లపై రాద్ధాంతం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ రెండు పార్టీలు పశ్చిమ బెంగాల్ తరహాలో వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Revanth Reddy
Congress
Rahul Gandhi
BJP
BRS
Telangana

More Telugu News