‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆర్ట్ ఫిల్మ్ కాదు.. ‘నాటునాటు’ పాట ఆర్ట్ సాంగ్ కాదు.. కానీ..: రామ్చరణ్
- ‘ది హాలీవుడ్ రిపోర్టర్’కు చెర్రీ ఇంటర్వ్యూ
- ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించిందన్న రామ్ చరణ్
- ‘నాటునాటు’ ప్రజల పాటన్న చెర్రీ
- ప్రజలు దానిని ఓన్ చేసుకున్నారని ఆనందం
దేశంలోని కోట్లాది మంది ప్రజల మద్దతు తమకు లభించినందుకు ఆనందంగా ఉందన్నాడు. అకాడమీ అవార్డ్స్ ఈ పాటను గుర్తించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ జర్నీ ఎలా అనిపించిందన్న ప్రశ్నకు రామ్ చరణ్ బదులిస్తూ.. ఇది తమకు చాలా ప్రత్యేకమన్నాడు. షూటింగ్ సమయంలో తాము ఆస్కార్ గురించి ఆలోచించలేదన్నాడు. ఇది ఆర్ట్ ఫిల్మ్ కానీ, ఆర్ట్ సాంగ్ కానీ కాదన్నాడు. కానీ అది ప్రజల పాట అయిందన్నాడు. ఈ పాటను ప్రజలు తమ సొంతం చేసుకున్నారన్నాడు.