స్నేహితుడిని చూసేందుకు కర్నూలు ఆసుపత్రికి వచ్చి పాడుపని.. దేహశుద్ధి చేసిన సిబ్బంది

Man Recorded video while woman bathing in hospital
  • రోగి సహాయకురాలు స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
  • బాధితురాలు కేకలు వేయడంతో పట్టుకున్న సిబ్బంది
  • చితకబాది పోలీసులకు అప్పగింత
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్నేహితుడిని చూసేందుకు వచ్చిన యువకుడు.. రోగి సహాయకురాలు స్నానం చేస్తుండగా వీడియో తీసి కలకలం రేపాడు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్నేహితుడిని పరామర్శించేందుకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వకు చెందిన ఏలియా వచ్చాడు. 

ఈ క్రమంలో రోగి సహాయకురాలు ఒకరు ఆసుపత్రి బాత్రూములో స్నానం చేస్తుండగా గోడపైకెక్కి ఫొటోలు, వీడియోలు తీశాడు. గమనించిన బాధితురాలు కేకలు వేయడంతో సిబ్బంది, ఆసుపత్రికి వచ్చిన వారు ఏలియాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
Go Back to Shorts
Kurnool District
Kurnool Hospital
Patient
Video

More Telugu News