ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌కు మాతృవియోగం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌కు మాతృవియోగం

Madhuri Dixits mother Snehalata passes away at 91
  • ముంబైలోని స్వగృహంలో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచిన స్నేహలత దీక్షిత్
  • తల్లి మరణవార్తను వెల్లడించిన మాధురి దీక్షిత్ దంపతులు
  • నేడు వర్లీలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు
ప్రముఖ నటి మాధురి దీక్షిత్ మాతృమూర్తి స్నేహలతా దీక్షిత్ (91) కన్నుమూశారు. ముంబైలోని ఆమె స్వగృహంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. మాధురి, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె తుదిశ్వాస విడిచారు’’ అని పేర్కొన్నారు. వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3.00 గంటలకు స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే స్నేహలత మృతికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. 

కాగా, గతేడాది తన తల్లి 90వ పుట్టిన రోజు సందర్భంగా మాధురి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెలకు తల్లికి మించిని ఆప్తమిత్రులు లేరని వ్యాఖ్యానించారు. తనకు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించిన తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
Advertisement
Madhuri Dixit

More Telugu News