టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ హ్యాక్.. రెండు పరీక్షలు వాయిదా
- ఈ రోజు జరగాల్సిన టీపీబీవో పరీక్ష వాయిదా వేసిన కమిషన్
- ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష కూడా
- పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు అనుమానిస్తున్న అధికారులు
హ్యాకింగ్ లో రెండు పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హ్యాకింగ్ ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. కానీ, టీపీబీవో పరీక్షకు ఒకరోజు ముందు హ్యాక్ విషయాన్ని వెల్లడించి, పరీక్ష వాయిదా వేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. ఇక, హ్యాకింగ్ అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ, కమిషన్ స్థానిక బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.