DCW: మొన్న ఖుష్బూ.. ఇప్పుడు స్వాతి.. లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు

  • తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానన్న స్వాతి మాలీవల్
  • ఆయన వస్తున్నారంటే మంచం కింద దాక్కునేదానినన్న డీసీడబ్ల్యూ చైర్ పర్సన్
  • తండ్రి దెబ్బలకు రక్తం వచ్చేదని గుర్తు చేసుకున్న స్వాతి
Was sexually assaulted by father when I was a child Swati Maliwal

‘‘తండ్రి ఇంటికి వస్తుంటే భయమేసేది. ఆయన వస్తున్నారంటే చాలు భయంతో మంచం కింద దాక్కునేదానిని’’ ఈ మాటలన్నది మరెవరో కాదు.. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మాలివాల్. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినేనని పేర్కొన్నారు. 

తాను నాలుగో తరగతి చదువుతున్న వరకు మేం ఆయనతో కలిసే ఉన్నామని చెప్పిన స్వాతి.. ఆయన తనను అకారణంగా కొట్టేవారని అన్నారు. కొన్నిసార్లు రక్తం కూడా వచ్చేదని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఇంట్లోకి వస్తున్నారంటే వణికిపోయేదానినని, ఆయన లైంగిక వేధింపులు భరించలేక చాలాసార్లు మంచం కింద దాక్కున్నానని మాలివాల్ అన్నారు. 

కాగా, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 8 ఏళ్ల వయసులోనే తాను తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తనకు 15 ఏళ్ల వయసు వచ్చాక తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టానని, ఆ తర్వాత ఏడాదికే ఆయన తమను వదిలేసి వెళ్లిపోయారని ఖుష్బూ తెలిపారు.

More Telugu News