ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న కవిత
- ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు
- దాదాపు 8 గంటలపాటు విచారించిన ఈడీ
- మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి హైదరాబాద్‌కు
- బేగంపేట నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు
- ఈడీ విచారణ జరిగిన తీరును తండ్రికి వివరించిన కవిత
అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. అర్ధరాత్రి 12.10 గంటలకు బేగంపేట చేరుకున్న కవిత అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. తండ్రి కేసీఆర్‌ను కలిసి ఈడీ విచారణ జరిగిన తీరును వెల్లడించారు.