షెఫాలీ సుడిగాలి ఇన్నింగ్స్... ఢిల్లీ అద్భుత విజయం
- గుజరాత్ జెయింట్స్ పై 10 వికెట్ల తేడాతో గెలిచిన క్యాపిటల్స్
- 28 బంతుల్లో 76 పరుగులు చేసిన షెఫాలీ
- 10 ఫోర్లు, 5 సిక్సర్లతో శివమెత్తిన యువ బ్యాటర్
- 106 పరుగుల లక్ష్యాన్ని 7.1 ఓవర్లలోనే ఊదిపారేసిన ఢిల్లీ
మరో ఎండ్ లో కెప్టెన్ మెగ్ లానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్) కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అందుకు కారణం కూడా షెఫాలీనే. బుల్లెట్ షాట్లతో చెలరేగిన షెఫాలీ మ్యాచ్ ను సునామీ వేగంతో ముగించింది. గుజరాత్ బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమన్నారు. డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ప్రస్తుతం రెండోస్థానంలో ఉంది.