K Kavitha: ఈడీ ఆఫీస్ లో కవిత.. భర్త అనిల్, లాయర్ ను బయటే ఆపేసిన అధికారులు

Kavita ED questioning begins
  • లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు కవిత హాజరు
  • కవితను మాత్రమే లోపలకు అనుమతించిన అధికారులు
  • కవితను ప్రశ్నిస్తున్న ఐదుగురు అధికారుల బృందం
లిక్కర్ స్కాంలో విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు భర్త అనిల్, లాయర్ మోహన్ రావు కూడా ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. అయితే, వీరిద్దరినీ ఈడీ అధికారులు బయటే ఆపేశారు. దీంతో, కవిత ఒక్కరే కార్యాలయం లోపలకు వెళ్లారు. 

ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని ఐదుగురు అధికారుల బృందం కవితను ప్రశ్నిస్తోంది. ఆమె కోసం 26 ప్రశ్నలను ఈడీ సిద్ధం చేసినట్టు సమాచారం. ఈడీ పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు అక్కడ సెక్షన్ 144ని విధించారు. 

K Kavitha
BRS
Enforcement Directorate
Delhi Liquor Scam

More Telugu News