OLA scooter: కోట్లు ఉన్నా ఈ స్కూటర్ ను కొనలేరట! దీని ప్రత్యేకత ఏంటంటే..!

  • హోలీ సందర్భంగా ఓలా స్పెషల్ ఎడిషన్
  • కేవలం 5 స్కూటర్లు మాత్రమే తయారుచేసిన కంపెనీ
  • పోటీలో నెగ్గిన వారికి అందజేయనున్నట్లు వెల్లడి
This rare Ola S1 electric scooter can not be bought even if you have crores in bank account

రంగుల పండుగ హోలీ సందర్భంగా ఓలా కంపెనీ ప్రత్యేకంగా కొత్త స్కూటర్ ను తీసుకొచ్చింది. ఇటీవల ఓలా సీఈవో భవీశ్ అగర్ వాల్ స్కూటర్ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. హోలీ ఎడిషన్ పేరుతో తయారుచేసిన ఈ స్కూటర్ ను కోట్లు పెట్టినా సొంతం చేసుకోవడం సాధ్యం కాదట. ప్రచారం కోసం తయారుచేసిన ఈ స్కూటర్ ను దక్కించుకోవాలంటే కంపెనీ నిర్వహిస్తున్న పోటీలో నెగ్గాలట.. పోటీలో నెగ్గినా సరే అదృష్టం మీకు తోడుగా ఉంటేనే ఈ స్కూటర్ ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

కోట్లు ఖర్చు పెట్టినా సరే కొనలేనంత.. వందలు, వేల మందితో పోటీపడి నెగ్గినా సరే దక్కించుకోలేనంత ప్రత్యేకత ఈ స్కూటర్ లో ఏముందంటే.. కేవలం ఐదంటే ఐదు స్కూటర్లను మాత్రమే తయారుచేయడం, భవిష్యత్తులో తయారుచేసే అవకాశం లేకపోవడమే దీని స్పెషాలిటీ. హోలీ పండుగ సందర్భంగా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కంపెనీ స్పెషల్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. కేవలం ఐదు స్కూటర్లను మాత్రమే తయారుచేసింది. కంపెనీ ప్రచారంకోసం పండుగ థీమ్ తో పోటీ నిర్వహించి, ఐదుగురు విజేతలను లాటరీ ద్వారా ఎంపిక చేసి ఈ స్కూటర్ ను అందజేయనున్నట్లు తెలిపింది.

పోటీ ఏంటంటే..
ఓలా స్కూటర్ ఎస్ 1 తో హోలీ వేడుకలు జరుపుకున్న ఫొటోలను కంపెనీ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడమే.. అందులో అత్యుత్తమంగా భావించిన వాటిని ఎంపిక చేసి, వారిలో నుంచి లాటరీ ద్వారా ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తారు.

More Telugu News