ఏపీలో పాఠశాల విద్యార్థులకు ‘రాగిజావ’.. రెండోసారీ వాయిదా!
- పాఠశాల విద్యార్థులకు అదనపు ఆహారం అందించాలని నిర్ణయం
- తొలుత ఈ నెల 2న ప్రారంభిస్తామన్న విద్యాశాఖ
- ఆ తర్వాత 10కి వాయిదా.. ఇప్పుడు 21కి వాయిదా వేసిన ప్రభుత్వం
రాగి జావను ఎలా తయారు చేయాలి? అందుకు కావాల్సిన వస్తువులేంటి? రేషన్ షాపు వద్ద వాటిని ఎలా తీసుకోవాలి అన్న వివరాలను బుధవారం విద్యాశాఖ విడుదల చేసింది. అయితే, మళ్లీ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. రాగిజావ కార్యక్రమాన్ని ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టు చెబుతూ జిల్లా అధికారులకు నిన్న సమాచారం అందించింది.