శీతల పానీయాల వ్యాపారంలోకి రిలయన్స్
- గతంలో సందడి చేసిన కాంపా డ్రింకులు
- కాంపా బ్రాండ్ ను కొనుగోలు చేసిన రిలయన్స్
- తాజాగా మార్కెట్లోకి విడుదల
- తొలుత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మకాలు
భారత శీతలపానీయాల విపణిలో కాంపా రంగప్రవేశం చేసింది. అప్పట్లో కాంపా కోలా, కాంపా ఆరెంజ్, కాంపా లెమన్ డ్రింకులు మార్కెట్ లో కనిపించేవి. తర్వాత కాలంలో థమ్సప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ వంటి శీతలపానీయాల రాకతో కాంపా డ్రింకులు తెరమరుగయ్యాయి.
కాగా, రిలయన్స్ సంస్థ తాజాగా కాంపాను కొత్త డిజైన్ బాటిళ్లు, ప్యాక్ లలో తీసుకువస్తోంది. 200 ఎంఎల్ నుంచి 2 లీటర్ ప్యాక్ ల వరకు అందుబాటులోకి తీసుకువస్తోంది. 200 ఎంఎల్ ధర రూ.10 మాత్రమే. మొదటగా తెలుగు రాష్ట్రాల్లో వీటి విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ వెల్లడించింది.