Balakrishna: బాలకృష్ణ 108వ సినిమా షూటింగులో శ్రీలీల!

  • బాలకృష్ణ 108వ సినిమాకి మొదలైన సన్నాహాలు 
  • ఆయన కూతురు పాత్రలో కనిపించనున్న శ్రీలీల
  • సంగీతాన్ని అందిస్తున్న తమన్ 
  • బాలయ్యతో వరుసగా ఇది మూడో సినిమా  
Balakrishna 108 Movie Update

బాలకృష్ణ 108వ సినిమా ప్రస్తుత్తం సెట్స్ పై ఉంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో తన మార్కు కామెడీ కంటే, బాలయ్య తరహా యాక్షన్ ఎక్కువగా ఉంటుందని ఇంతకు ముందే అనిల్ రావిపూడి చెప్పాడు.
 
ఇందులో తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయనీ, బాలయ్యకి కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుందని అనిల్ రావిపూడి అన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. ఈ సినిమా షూటింగులో తాజాగా శ్రీలీల జాయిన్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆమెకి వెల్కమ్ చెప్పింది. 


ఈ సినిమాలో బాలయ్య సరసన కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'అఖండ' .. 'వీరసింహా రెడ్డి' సినిమాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ నిలబెట్టిన కారణంగా, సహాజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

More Telugu News