ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షలో విపక్షాల బల ప్రదర్శన
- మహిళా బిల్లు అమలు కోసం రేపు జంతర్ మంతర్ వద్ద దీక్ష
- ఆమెకు సంఘీభావం ప్రకటించనున్న పలు పార్టీల నేతలు
- చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్
ఇక ఈ దీక్షలో విపక్షాలు జంతర్ మంతర్ వేదికగా బల ప్రదర్శనకు దిగనున్నాయి. దీక్షకు హాజరై సంఘీభావం తెలపనున్న పార్టీల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, పీడీపీ, అకాలీదళ్, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీతో పాటు వామ పక్షపార్టీల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో కవిత ఈ కార్యక్రమం చేపట్టారు.