K Kavitha: కవిత విన్నపానికి ఓకే చెప్పిన ఈడీ.. కాసేపట్లో ఢిల్లీలో కవిత ప్రెస్ మీట్

Kavitha to attend ED questioning tomorrow
  • 11వ తేదీన ఈడీ విచారణకు హాజరవనున్న కవిత
  • మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రేపు దీక్ష  
  • కవిత దీక్షకు హాజరు కానున్న 16 పార్టీలు
లిక్కర్ స్కామ్ కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈరోజు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, 11వ తేదీన విచారణకు హాజరవుతానని ఈడీని ఆమె కోరారు. దీంతో విచారణను ఈడీ ఈ నెల 11కు వాయిదా వేసింది. 

మరోవైపు మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆమె రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయబోతున్నారు. ఆమె దీక్షకు దేశ వ్యాప్తంగా పలు ప్రతిపక్షాలు సంఘీభావం తెలపనున్నాయి. కవిత దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మహిళల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల నేతలు దీక్షలో పాల్గొనబోతున్నారు. ఈ మధ్యాహ్నం 1 గంటకు కవిత ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.
K Kavitha
BRS
Enforcement Directorate
Delhi Liquor Scam

More Telugu News