Sania Mirza: సానియా వీడ్కోలు కార్యక్రమంలో కనిపించని షోయబ్.. పొరపొచ్చాలు నిజమేనంటున్న నెటిజన్లు!

Shoaib Malik Misses Sania Mirza Farewell Party Netizens Questions
  • ఈ నెల 5న ఎల్బీ స్టేడియంలో సానియా వీడ్కోలు కార్యక్రమం
  • అదే రోజు రాత్రి విందు ఇచ్చిన టెన్నిస్ స్టార్
  • ఈ రెండు కార్యక్రమాలకు హాజరు కాని షోయబ్
హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భర్త షోయబ్ మాలిక్ మధ్య పొరపొచ్చాలు నిజమేనా? వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడసూపాయని, ఇద్దరూ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. వారి మధ్య సఖ్యత లేదని, విడిపోవడం ఖాయమంటూ మళ్లీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం కూడా ఉంది.

సానియా మీర్జా వీడ్కోలు మ్యాచ్‌కు, విందుకు భర్త షోయబ్ మాలిక్ హాజరు కాకపోవడమే ఈ ఊహాగానాలు మళ్లీ తెరపైకి రావడానికి కారణం. ఈ నెల 5న ఎల్బీ స్టేడియంలో సానియా వీడ్కోలు కార్యక్రమం జరగ్గా, అదే రోజు రాత్రి సానియా విందు ఏర్పాటు చేసింది. ఈ రెండు కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే షోయబ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో వారిద్దరి మధ్య ఎడం పెరిగిందన్న వార్తలు నిజమేనన్న చర్చ మళ్లీ మొదలైంది.

Sania Mirza
Shoaib Malik
Tennis Star Sania
Pakistan

More Telugu News