Anchor Lasya: మరో బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య

Anchor Lasya gives birth to baby boy
  • పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన లాస్య
  • 'ఇట్స్ ఏ బేబీ బోయ్' అని సోషల్ మీడియాలో తెలిపిన లాస్య
  • లాస్య తొలి కొడుకు పేరు జున్ను
ప్రముఖ బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ లాస్య మరోసారి తల్లి అయ్యారు. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమే స్వయంగా వెల్లడించారు. 'ఇట్స్ ఏ బేబీ బోయ్' అని ఆమె పోస్ట్ చేశారు. లాస్య ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూనే వస్తున్నారు. తన బేబీ బంప్ ఫొటోలు, సీమంతం ఫొటోలను అందరితో పంచుకున్నారు. మరోసారి తల్లి అయిన లాస్యకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లాస్యకు తొలిసారి కూడా కొడుకే పుట్టాడు. తొలి బిడ్డను ఆమె జున్ను అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.
Anchor Lasya
Son

More Telugu News