Michell Obama: ఒబామా భార్య అరగంట ఏడ్చిందట.. కారణం ఇదే!

Michell Obama cried for 30 minutes
  • ఎనిమిదేళ్లు వైట్ హౌస్ లో ఉన్న ఒబామా కుటుంబం
  • తన పిల్లలకు తెలిసిన ఇల్లు అదేనన్న మిషెల్
  • వచ్చేటప్పుడు ఎంతో బాధ కలిగిందని వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడిగా వరుసగా రెండు సార్లు బాధ్యతలను నిర్వర్తించిన నేతల్లో బరాక్ ఒబామా ఒకరు. అలాంటి ఒబామా భార్య మిషెల్ అరగంట సేపు ఏడ్చారంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరూ నమ్మరు. కానీ తాను ఏడ్చాననే విషయాన్ని ఆమే స్వయంగా తెలిపారు. ది లైట్ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఎనిమిదేళ్లు వైట్ హౌస్ లో ఉన్న తర్వాత... ఆ భవనాన్ని విడిచి వెళ్లడం ఎంతో బాధగా అనిపించిందని ఆమె చెప్పారు. తమ పిల్లలకు తెలిసిన ఏకైక ఇల్లు అదేనని... ఆ ఇంటిని విడిచి వెళ్లే సమయంలో బాధ అనిపించిందని తెలిపారు. ట్రంప్ ప్రమాణస్వీకారం రోజున అనేక కారణాల వల్ల కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. ఎనిమిదేళ్ల పాటు అక్కడ ఉండటం వల్ల అక్కడ పని చేసే సిబ్బందితో కూడా బంధం ఏర్పడిందని, వారిని వదిలి రావడం కూడా బాధగా అనిపించిందని తెలిపారు. ఆ బాధను తట్టుకోలేక అరగంట ఏడ్చానని చెప్పారు.

  • Loading...

More Telugu News