గగనతలంలో రెండు శిక్షణ విమానాల ఢీ... పైలట్ల మృతి
- ఇటలీలోని రోమ్ శివార్లలో విన్యాసాలు చేస్తున్న విమానాలు
- పరస్పరం ఢీకొని నేలకూలిన వైనం
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ
ఇవి రెండు యూ-208 రకం విమానాలు. ఇటలీ రాజధాని రోమ్ శివార్లలోని గిల్డోనియా మిలిటరీ ఎయిర్ పోర్టు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదం పట్ల ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన పైలట్ల కుటుంబాలకు, వారి సహచరులకు సంతాపం తెలియజేశారు. యూ-208 విమానం సింగిల్ ఇంజిన్ ట్రైనింగ్ విమానం. దీంట్లో పైలట్ సహా ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇది గరిష్ఠంగా గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.