Junior NTR: తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ ఆర్ ఆర్' రీ రిలీజ్!

RRR Re Release
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టించింది. 'ఆస్కార్' కి సంబంధించిన వేడుకల్లో ఈ సినిమాను గురించిన ప్రశంసలు వినిపిస్తున్నాయి. రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ అంతా కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. 
 
ఈ సినిమాకి దక్కిన గౌరవం గురించే అంతా చర్చించుకుంటున్న ఈ సమయంలో, ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ నెల 10వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.     

 అల్లూరి - కొమరమ్ భీమ్ ల ఆశయాన్ని .. దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. కథాకథనాల పరంగా .. చిత్రీకరణ పరంగా .. పాటల పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా .. కెమెరా పనితనం పరంగా ఈ సినిమా ఒక అద్భుతమైన దృశ్యరూపంగా నిలిచింది. అలాంటి ఈ సినిమా, రీ రిలీజ్ వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి.
Go Back to Shorts
Junior NTR
Ramcharan
Rajamouli
RRR Movie

More Telugu News