విద్యార్థినులకు 6 నెలల మెటర్నిటీ లీవ్.. కేరళ యూనివర్సిటీ ప్రకటన
- సెలవులు పూర్తయ్యాక నేరుగా క్లాసులకు హాజరవ్వొచ్చని వెల్లడి
- మరోమారు అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలేదని వివరణ
- కొచ్చిన్ యూనివర్సిటీ, కేరళ హెల్త్ సైన్సెన్ వర్సిటీల్లోనూ మెటర్నిటీ లీవ్
కిందటి వారం కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 60 రోజుల పాటు సెలవు తీసుకోవచ్చని తెలిపింది. రాష్ట్రంలో విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ప్రకటించిన తొలి యూనివర్సిటీ ఇదేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కూడా విద్యార్థినులకు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవ్ తీసుకునే సదుపాయం కల్పించాయి.