ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్ట్
- ఈడీ అదుపులో హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై
- సోమవారం రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించిన అధికారులు
- ఈ కేసులో ఇప్పటికే 11 మంది అరెస్టు
లిక్కర్ స్కామ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే! సోమవారంతో కస్టడీ ముగియగా అధికారులు సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. పోలీసులు సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, మనీలాండరింగ్ కేసును సవాల్ చేస్తూ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.