Revanth Reddy: తెలంగాణ తెచ్చిన వాళ్లకు రెండుసార్లు అధికారం ఇచ్చారు.. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వండి: రేవంత్ రెడ్డి

Revanth Reddy asks one chance for Congress party in Telangana
  • కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర
  • బీఆర్ఎస్ మంత్రులు సన్నాసులు అంటూ వ్యాఖ్యలు
  • కేసీఆర్ ఫ్యామిలీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా వదలడంలేదని వెల్లడి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీకి రెండు సార్లు అధికారం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

బీఆర్ఎస్ మంత్రులు సన్నాసులు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులు గంగుల, ఎర్రబెల్లి పేర్లు చెబితే తలెత్తుకోలేని పరిస్థితి అని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా వదలడంలేదని అన్నారు. వేల కోట్లు ఉన్న మీరు పేదల సొమ్ము కూడా తింటారా? అని నిలదీశారు. 

రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పెళ్లయిన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదని ఆరోపించారు. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ను గెలిపించి బీఆర్ఎస్ సర్కారుకు బుద్ధి చెప్పాలని అన్నారు.
Revanth Reddy
Congress
BRS
KCR
Telangana

More Telugu News