అప్పుడే మండిపోతున్న ఎండలు.. గతేడాది కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
- తెలంగాణలోని చాలా జిల్లాలో రెండు డిగ్రీలకు పైగా పెరిగిన ఉష్ణోగ్రతలు
- భూపాలపల్లి జిల్లాలో నిన్న 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- మున్ముందు మరింత పెరుగుతాయంటున్న నిపుణులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది నాలుగో తేదీన 37.3 డిగ్రీలు నమోదు కాగా, నిన్న దాదాపు మూడు డిగ్రీలు అధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోనూ నిన్న 40 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, మహబూబ్‌నగర్, భద్రాచలం జిల్లాల్లో ఉష్ణోగ్రత 21 డిగ్రీలు దాటింది. వేసవిలోకి అడుగుపెట్టీ పెట్టగానే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం మున్ముందు ఎండలు ముదురుతాయని చెప్పడానికి సంకేతమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.