Kiren Rijiju: సింహాలు చెట్లు కూడా ఎక్కుతాయా?

చిరుత పులులు చెట్లు ఎక్కుతాయని తెలుసు. మరి సింహాలు? అవి కూడా చెట్లు ఎక్కగలవు. అందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేసిన ఈ వీడియోనే నిదర్శనం. దీన్ని చూసిన వారి కళ్లు పెద్దవి అయిపోతాయి. ఎందుకంటే ఒకటీ, రెండూ కాదు పదుల సంఖ్యలో సింహాలు చెట్టుపైకి ఎక్కి.. కొమ్మలపై హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. పొరపాటుగా ఈ చెట్టు వైపు ఎవరైనా వెళితే ఇక అంతే..!

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2023 సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి ఈ సింహరాజాల వీడియోని షేర్ చేశారు. ప్రకృతిని పరిరక్షించాలని, చెట్టెక్కిన సింహాల వీడియో ఏ ప్రాంతానికి చెందినది? అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. సింహాలు నేలపై వేటకు జంతువులను గుర్తించేందుకు ఇలా చెట్లు ఎక్కుతుంటాయి. నేలపై వేడి ఎక్కువగా ఉంటే, చల్లదనం, ఉపశమనం కోసం కూడా చెట్లు ఎక్కుతుంటాయి.
Kiren Rijiju
shares rare video
liones
tree
World Wildlife Day

More Telugu News