గాల్వన్ లోయలో తుపాకీలు పక్కన పెట్టి బ్యాట్ పట్టిన జవాన్లు
- గతంలో రక్తంతో తడిసిన ప్రదేశంలో ఇప్పుడు క్రికెట్
- క్రికెట్ పోటీ నిర్వహించిన పటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్
- ఉత్సాహంగా క్రికెట్ ఆడిన జవాన్లు
అప్పుడు రక్తంతో తడిసిపోయిన పెట్రోలింగ్ పాయింట్ - 14 ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ గా మారిపోయింది. పటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీని నిర్వహించింది. పీపీ-14కు 4 కిలోమీటర్ల దూరంలో పోటీ జరిగింది. ఈ పోటీలో మన జవాన్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తుపాకులు పక్కన పెట్టి బ్యాట్ పట్టారు.