Jr NTR: తారకరత్న దశ దిన కార్యక్రమంలో ఎన్టీఆర్ భావోద్వేగ నివాళి... వీడియో ఇదిగో!
- కుప్పంలో గుండెపోటుకు గురైన తారకరత్న
- బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
- మృత్యువుతో పోరాడి ఓడిన తారకరత్న
- నేడు హైదరాబాదులో పెద్ద కర్మ
అటు అభిమానులను, ఇటు కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల కన్నుమూశారు. కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోగా, 23 రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.
కాగా, ఆయన పెద్ద కర్మ నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్నకు భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు ఆన్చి నివాళి అర్పించారు.