చరిత్ర సృష్టించిన హెకానీ జఖాలూ... నాగాలాండ్ అసెంబ్లీలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యే
- నాగాలాండ్ కు రాష్ట్ర హోదా లభించి 60 ఏళ్లు
- అసెంబ్లీలో ఇప్పటివరకు మహిళా ప్రాతినిధ్యం లేని వైనం
- దిమాపూర్-3 నియోజకవర్గం నుంచి హెకానీ జఖాలూ
ఈ ఎన్నికల్లో జఖాలూ దిమాపూర్-3 నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 183 మంది అభ్యర్థులో బరిలో దిగగా, వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఆ నలుగురిలో మొదటగా విజయం సాధించింది హెకానీ జఖాలూ ఒక్కతే. 48 ఏళ్ల జఖాలూ వృత్తి రీత్యా న్యాయవాది. మరో మహిళా అభ్యర్థి సల్హౌటుయోనువో క్రూసే ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు.
నేడు నాగాలాండ్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా... ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించి, 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోసారి ఎన్డీపీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తాజా ఫలితాల సరళి చెబుతోంది.