Delhi Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్

cbi special court has granted conditional bail to the accused in the delhi liquor scam
  • షరతులతో మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు
  • లక్ష రూపాయల బాండ్, ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశం
  • అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని వార్నింగ్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరికొందరు నిందితులకు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఐదుగురు నిందితులకు 30 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు గాల్ బ్లాడర్ చికిత్స కోసం బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఆయనతో పాటు అరుణ్ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్ ల బెయిల్ పిటిషన్ ను విచారించింది. సీబీఐ కేసులో పిళ్లై, గౌతమ్, కుల్దీప్, నరేంద్రలకు.. ఈడీ కేసులో సమీర్ మహేంద్రుకు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.

నిందితులు తలా రూ. లక్ష పూచీకత్తు, ఒక ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు షరతు విధించింది. అనుమతిలేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది. అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. షరతులు అతిక్రమిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ 12 మందిని అరెస్ట్ చేశాయి. సీబీఐ నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు ఏడుగురికి బెయిల్ లభించింది.
Delhi Liquor Scam
CBI
ED
bail
special court

More Telugu News