Shiva kandukuri: 'భూతద్దం భాస్కర్ నారాయణ' లిరికల్ సాంగ్ రిలీజ్!

Bhoothaddam Bhaskar Narayana lyrical Song Released
షార్ట్స్‌లో చూడండి
శివ కందుకూరి విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమా రెడీ అవుతోంది. రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. "డప్పుకొట్టి చెప్పుకోనా ఊరంత నేను డప్పుకొట్టి చెప్పుకోనా, గుప్పెడంత గుండెలోనా ఆనందమంత డప్పుకొట్టి చెప్పుకోనా" అంటూ ఈ పాట సాగుతోంది. హీరోయిన్ పట్ల తన ప్రేమభావాలను వ్యక్తం చేస్తూ హీరో పాడుకునే పాట ఇది.

హీరో .. హీరోయిన్స్ పై చిత్రీకరించిన పాట ఇది. విజయ్ బుల్గనిన్ స్వరపరిచిన ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఈ బీట్ యూత్ కి పట్టేదిలానే ఉంది. స్నేహాల్ .. శశిధర్ .. కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి, పురుషోత్తం రాజు దర్శకత్వం వహించాడు.
Go Back to Shorts
Shiva kandukuri
Rashi Singh
Bhoothaddam Bhaskar Narayana Movie

More Telugu News