లాలూ ప్రసాద్, ఆయన భార్యకు ఢిల్లీ హైకోర్టు సమన్లు
- యూపీఏ-1 హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ
- భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారంటూ సీబీఐ కేసు
- ఇటీవలే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఆర్జేడీ అధినేత
కేసు వివరాల్లోకి వెళ్తే... ఇది యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. బీహార్ లోని అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూములను తీసుకుని, వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలను ఇప్పించారని వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరోవైపు ఇటీవలే సింగపూర్ లో లాలూ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన ఆయనకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.