super foods: దీర్ఘాయుష్షు కోసం తినాల్సిన ఫుడ్స్..

  • రోజూ సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు
  • కొలెస్ట్రాల్, గుండె జబ్బుల నివారణ
  • బ్లూ బెర్రీలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర, చేపలు మంచివి
super foods you can eat daily for longevity

మంచి ఆరోగ్యంతో దీర్ఘకాలం పాటు జీవించాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ, ఇందుకోసం మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిందే. ఆరోగ్యం కోసం సమతులాహారం అవసరం. కానీ, నేటి కాలంలో సమతులాహారం అసాధ్యంగా మారింది. మారిన జీవనశైలి, ఆర్థిక పరిస్థితులు ఇలా ఎన్నో అంశాలను కారణాలుగా చెప్పుకోవచ్చు. కానీ, నిండు నూరేళ్లు కాకపోయినా.. వీలైనంత దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని అనుకునే వారు.. కొన్నింటిని తప్పకుండా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మంచి పోషకాలు పుష్కలంగా ఉండి, తక్కువ కేలరీలు ఇచ్చే వాటిని సూపర్ ఫుడ్స్ గా చెబుతున్నారు. 

బ్లూ బెర్రీలు
ఫైబర్, మాంగనీస్, విటమిన్ కే సహా మంచి యాంటీ ఆక్సిడెంట్లు బ్లూ బెర్రీల్లో పుష్కలంగా లభిస్తాయి. రక్తపోటును తగ్గించి, గుండె జబ్బులను నివారించేందుకు బ్లూబెర్రీలు సాయపడతాయి.

గోజి బెర్రీలు
చిన్నగా, ఎర్రగా ఉండే ఈ బెర్రీల్లో విటమిన్ సీ, ఈ, పలు రకాల ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. వీటితో కాలేయం, కిడ్నీల ఆరోగ్యం బలపడుతుంది. 

ఆకుపచ్చని కూరలు
పాలకూర, కొల్లార్డ్ గ్రీన్స్ (కశ్మీర్లో పండే) సూపర్ ఫుడ్స్ కిందకు వస్తాయి. వీటిల్లో విటమిన్ ఏ, సీ, ఈ, కే దండిగా లభిస్తాయి. కెరటోనాయిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం సైతం లభిస్తాయి.

సాల్మన్
ఇవి ఒక రకం చేపలు. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను ఇవి తీసేస్తాయి. దీంతో గుండెకు రక్షణ ఏర్పడుతుంది. 

నట్స్
వాల్ నట్, ఆల్మండ్ నుంచి ప్లాంట్ ప్రొటీన్ లభిస్తుంది. మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. గుండె జబ్బుల నుంచి రక్షణనిస్తాయి.

క్రూసిఫెరోస్ కూరగాయలు
బ్రొక్కోలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా క్రూసిఫెరోస్ కిందకే వస్తాయి. వీటిల్లో ఫైబర్, ఇండోల్స్, నైట్రైల్స్, థియోసైనేట్స్ వంటి ఫైటో కెమికల్స్ తగినంత లభిస్తాయి. 

సీడ్స్
సన్ ఫ్లవర్, గుమ్మడికాయ, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. కొలెస్ట్రాల్, గుండెజబ్బుల రిస్క్ ను ఇవి గణనీయంగా తగ్గించగలవు.

More Telugu News