రామ్ చరణ్ మరో ఘనత.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ఫంక్షన్ లో అరుదైన గౌరవం

  • హెచ్సీఏ అవార్డ్ ఫంక్షన్ లో అవార్డును ప్రకటించిన చరణ్
  • బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును ప్రకటించిన యంగ్ హీరో
  • ప్రస్తుతం యూఎస్ లో ఉన్న 'ఆర్ఆర్ఆర్' టీమ్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని బెవెర్లీ హిల్స్ లో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ ఫంక్షన్లో ఆయన బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును ప్రకటించారు. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' టీమ్ ప్రస్తుతం అమెరికాలో ఉంది. మార్చ్ 12న జరిగే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం వారు యూఎస్ చేరుకున్నారు. ఇంకోవైపు మార్చ్ 16న విడుదల కానున్న క్రిటిక్స్ సూపర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు. 

Ramcharan
Tollywood
HCA Awards

More Telugu News