మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
- మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్ పల్లి ఇళ్లలో సోదాలు
- ఉదయం నుంచి కొనసాగుతున్న తనిఖీలు
- ఏ విషయంలో సోదాలను నిర్వహిస్తున్నారో వెల్లడించని అధికారులు
ఇప్పటి వరకు నారాయణపై ఏపీ సీఐడీ అధికారులు పలు కేసులు (ఎగ్జామ్ పేపర్ లీక్, అమరావతి భూముల వ్యవహారం) పెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు, ఇప్పుడు ఏ విషయంలో నారాయణ కుమార్తె నివాసంలో సోదాలు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం సీఐడీ అధికారులు వెల్లడించలేదు. అయితే, టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.