KTR: మీరు ఇటుకలతో కొడితే మా వాళ్లు బండరాళ్లతో కొడతారు: కేటీఆర్

KTR fires on Congress party
  • భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
  • టీపీసీసీ చీఫ్ ఒక్క చాన్స్ అంటూ తిరుగుతున్నాడని కేటీఆర్ విమర్శలు
  • పది చాన్సులు ఇస్తేం ఏంచేశారని ఆగ్రహం
తెలంగాణ మంత్రి కేటీఆర్ నేడు భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్క చాన్స్ అంటూ తిరుగుతున్నాడని, 75 ఏళ్ల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ కు ఒక్కటి కాదు పది అవకాశాలు ఇచ్చారని, మళ్లీ ఆ దిక్కుమాలిన పాలన కావాలా? అని ప్రశ్నించారు. 

"అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? 12 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి లోబడే నాడు టీఆర్ఎస్ లో చేరారు. మీరు ఇటుకలతో కొడతామంటున్నారు. మా కార్యకర్తలు బండరాళ్లతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త... నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు" అని కేటీఆర్ హెచ్చరించారు. 

ఇక, కర్ణాటక బీజేపీ నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలనే కర్ణాటకలోనూ అమలు చేయాలని కోరుతున్నారని, లేకపోతే తమ నియోజవర్గాలను తెలంగాణలో కలిపేయాలంటున్నారని వెల్లడించారు.
KTR
BRS
Congress
Telangana

More Telugu News