టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ తండ్రి మృతి

  • ఉమేష్ తండ్రి తిలక్ యాదవ్ కన్నుమూత
  • ఆయన వయసు 74 సంవత్సరాలు
  • తిలక్ యాదవ్ ప్రొఫెషనల్ రెజ్లర్ కూడా
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి తిలక్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో పని చేసిన తిలక్ యాదవ్... ప్రొఫెషనల్ రెజ్లర్ కూడా కావడం గమనార్హం. ఉమేశ్ తండ్రి మరణ వార్త గురించి తెలిసిన భారత క్రెటర్లు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఉమేశ్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

ఇంకోవైపు, మార్చి 1న ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టుకు ఉమేశ్ అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. అయితే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం మాత్రం మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలకే ఎక్కువగా ఉంది. తొలి రెండు టెస్టులకు కూడా ఉమేశ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.

Umesh Yadav
Team India
Father
Dead

More Telugu News