నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను సతీసమేతంగా కలిసిన సీఎం జగన్

CM Jagan met governor couple along with his wife YS Bharathi
  • ఏపీ కొత్త గవర్నర్ గా అబ్దుల్ నజీర్ నియామకం
  • రాజ్ భవన్ కు వెళ్లిన జగన్, వైఎస్ భారతి
  • గవర్నర్ దంపతులతో మర్యాదపూర్వక భేటీ
ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్, వైఎస్ భారతి గవర్నర్ దంపతులతో భేటీ అయ్యారు. 

గవర్నర్ కు సీఎం జగన్ ఓ మొక్కను బహూకరించగా, వైఎస్ భారతి గవర్నర్ అర్ధాంగికి ఓ చీరను కానుకగా ఇచ్చారు. అనంతరం గవర్నర్ దంపతులతో జగన్, భారతి కాసేపు ముచ్చటించారు. వివిధ అంశాలపై సీఎం జగన్, గవర్నర్ నజీర్ మధ్య చర్చ జరిగింది.
Go Back to Shorts
Jagan
Governor
Raj Bhavan
Vijayawada
Andhra Pradesh

More Telugu News