కట్ డ్రాయర్లతో రోడ్ల మీద ఊరేగిస్తా: నారా లోకేశ్

Nara Lokesh warning to YSRCP leaders
  • మేము తెగిస్తే రాష్ట్రంలో ఒక్క వైసీపీ ఆఫీసు కూడా మిగలదన్న లోకేశ్ 
  • టీడీపీపై దాడి చేసే ఏ ఒక్కడినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిక 
  • గన్నవరంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శ 
గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయడంపై నారా లోకేశ్ మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే తాము సహనాన్ని పాటిస్తున్నామని, ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తున్నామని చెప్పారు. వైసీపీ మూకల్లాగే తాము కూడా తెగిస్తే రాష్ట్రంలో ఒక్క వైసీపీ కార్యాలయం కూడా మిగలదని హెచ్చరించారు.

గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశామని వైసీపీ అనుకుంటోందని... కానీ ఆ పార్టీ ధ్వంసం చేస్తోంది రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీపై దాడి చేసిన ఏ ఒక్కడినీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మాకు పౌరుషం లేదనుకుంటున్నారా? కట్ డ్రాయర్లలో రోడ్ల మీద ఊరేగిస్తా గుర్తుంచుకోండి అని హెచ్చరించారు. గన్నవరంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని అన్నారు. సీఎం జగన్ రెడ్డి, అతనితో చేతులు కలిపిన కొంతమంది కళంకిత పోలీసులే హంతకులు అని... ఈ హత్యను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరారు. 

Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Gannavaram

More Telugu News